‘తల్లికి వందనం’ పథకం: ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం.. ఇప్పుడు వీరికీ వర్తింపు! | Thalliki Vandanam latest Good News

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

ఇక ఆ కుటుంబాలకూ తల్లికి వందనం అమలు, ప్రభుత్వం తాజా నిర్ణయం..!! | Thalliki Vandanam Latest Update 2025

ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అమ్మ ఒడికి అమలు చేసిన నిబంధనలతోనే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం అమలు చేశారు. ముందుగానే జాబితాలను ప్రకటించి, అర్హత ఉండి, రాని వారికి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. కాగా, ఇప్పుడు ఆశా వర్కర్లు, అంగన్వాడీల్లో పనిచేసే వారి కుటుంబాలకు ఈ పథకం అమలు చేసే ఆలోచనతో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

AP Auto Drivers Sevalo Scheme 15000 Dasara Gift
💥 దసరా కానుక: ఏపీలో వారందరికీ రూ.15,000! అకౌంట్లలో డబ్బులు ఎప్పుడంటే? | AP Auto Drivers Sevalo Scheme

రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద 66,57,508 మంది విద్యార్థులకు ప్రభుత్వం సాయం అందించింది. ఈ మేరకు వివరాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద లబ్ధిపొందిన విద్యార్థుల వివరాలపై శాసనమండలిలో జరిగిన చర్చలో పథకం అమలు గురించి వివరించారు. ఇంటర్ మొదటి ఏడాదిలో చేరిన తర్వాత పరిశీలించి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, సమస్యలు ఏమైనా ఉంటే వాట్సాప్ ద్వారా సంప్రదించాలని సూచించినట్లు వెల్లడించారు. గతంలో వైసీపీ పెట్టిన నిబంధనలనే తాము అమలు చేస్తున్నామని, 300 యూనిట్లు, ఆప్కాస్ ఉద్యోగుల నిబంధన, భూమి నిబంధనలు వైసీపీ హయాంలోనే విధించారని లోకేష్ గుర్తుచేశారు.

Post Office New Faeture ePassbook 2025
సుకన్య సమృద్ధి, PPF ఇన్వెస్టర్లకు శుభవార్త: పోస్టాఫీస్ కొత్త ఫీచర్ (e-Passbook)తో ఇక ఇంటి నుంచే అన్ని వివరాలు!

అర్హులందరికీ తల్లికి వందనం తప్పకుండా వర్తింపజేస్తామని, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కుటుంబాలకు కూడా తల్లికి వందనం పథకం వర్తింపు విషయాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. తల్లికి వందనం పథకం కింద 66,57,508 మంది విద్యార్థులకు సాయం అందించినట్లు వివరించారు. ఒకటో తరగతి విద్యార్థులకు అపార్ ఐడీ మంజూరు చేసిన తర్వాత తల్లికి వందనం అందజేస్తామని చెప్పామన్నారు. ఇంటర్ మొదటి ఏడాదిలో చేరిన తర్వాత పరిశీలించి నిధులు విడుదల చేస్తామని వివరించారు. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం కూడా నగదు అందజేస్తోంది. రెండింటిని జోడించి నగదు జమ చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజిటల్ రేషన్ కార్డులు కూడా మంజూరు చేశామని, ఎవరైనా అర్హులు ఉంటే తల్లికి వందనం తప్పకుండా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.

AP Balika Samrakshana Scheme Funds Update
ఒక్క అమ్మాయి ఉంటే రూ.లక్ష, ఇద్దరమ్మాయిలుంటే రూ.30వేలు ఉచితంగానే.. నిధులు ఎప్పుడు వస్తాయి? | Balika Samrakshana Scheme
Also Read..
Thalliki Vandanam Latest Update 2025ఏపీ నిరుద్యోగులకు బంపరాఫర్: ఉచిత కోచింగ్, హాస్టల్‌తో ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం! ఇప్పుడే అప్లై చేసుకోండి!
Thalliki Vandanam Latest Update 2025అద్భుతం! కేవలం రూ.199 లోపు 5 బెస్ట్ ప్లాన్స్ ఇవే!
Thalliki Vandanam Latest Update 2025 ఏపీలో ఆటో డ్రైవర్లకు 15 వేల పథకం – వాహన మిత్ర కోసం 16 షరతులు!

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
   WhatsApp Icon Join WhatsApp