వాటిపై రూ.51,500 తగ్గింపు.. దేనికి ఎంత ఫుల్ లిస్ట్ ఇదే | SBI Card Festival Offers 2025
దసరా, దీపావళి పండగల సీజన్‌కి ముందే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారులకు భారీ గిఫ్ట్ ఇచ్చింది. SBI కార్డ్ ఫెస్టివల్ ఆఫర్స్ 2025 పేరుతో ప్రత్యేకమైన ‘ఖుషియాన్ అన్‌లిమిటెడ్’ క్యాంపెయిన్ ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు రూ.51,500 వరకు డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా 2900 నగరాల్లో ఆఫర్లు
SBI తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఫెస్టివల్ ఆఫర్స్ దేశవ్యాప్తంగా 2900 సిటీల్లో అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకంగా టైర్-2, టైర్-3 నగరాలు లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ రూపొందించబడింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

1250కిపైగా డీల్స్ – EMI & క్యాష్‌బ్యాక్ స్పెషల్
ఈ ఫెస్టివల్ ఆఫర్స్‌లో 1250కి పైగా డీల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, జువెలరీ, గ్రాసరీ, ఆటోమొబైల్ వంటి విభాగాల్లో తక్షణ తగ్గింపులు, EMI ఆప్షన్లు, క్యాష్‌బ్యాక్ లభిస్తాయి. కస్టమర్లు తమ SBI క్రెడిట్ కార్డ్ ద్వారా షాపింగ్ చేస్తే ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు పొందగలరు.
ప్రధానమైన ఆఫర్లు – ఒకసారి చూడండి
- అమెజాన్ – ఏ ఉత్పత్తిపైనా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్
- యాపిల్ ప్రొడక్ట్స్ – రూ.6000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (డిసెంబర్ 27 వరకు)
- బజాజ్ ఆటో – కనీస రూ.30,000 ట్రాన్సాక్షన్‌పై 10% తగ్గింపు
- ఫ్యాషన్ ఫ్యాక్టరీ – రూ.4000 పైగా కొనుగోలు చేస్తే 5% ఇన్‌స్టంట్ డిస్కౌంట్
- హెయిర్ (Haier) – EMI ట్రాన్సాక్షన్‌పై 25% వరకు తగ్గింపు
- HP ఉత్పత్తులు – ఒక్కో కార్డుకు రూ.15,000 వరకు తగ్గింపు (అక్టోబర్ 31 వరకు)
- LG – గరిష్టంగా 26% తగ్గింపు (సెప్టెంబర్ 30 వరకు)
- సామ్‌సంగ్ కన్సూమర్ డ్యూరబుల్స్ – EMI ఆప్షన్ ద్వారా 27.5% వరకు డిస్కౌంట్ (గరిష్ఠంగా రూ.51,500 వరకు)
- సోనీ – 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (సెప్టెంబర్ 30 వరకు)
- రేమండ్ నేషనల్ – రూ.7500 పైగా కొనుగోలు చేస్తే 5% క్యాష్‌బ్యాక్ (అక్టోబర్ 23 వరకు)
- వివో స్మార్ట్‌ఫోన్స్ – EMI ట్రాన్సాక్షన్లపై రూ.15,000 వరకు తగ్గింపు
The Great Indian Festival Early Deals Are Here!
Enjoy 10% Instant Discount with your SBI Debit Card while shopping on https://t.co/IIqJXQucv8.
Don’t miss out on amazing festive deals. Shop now and save big!
To know more, visit: https://t.co/glGDWww07c pic.twitter.com/iuQe9qyHDH— State Bank of India (@TheOfficialSBI) September 22, 2025
వినియోగదారులకే లాభం
ఈసారి SBI Card తన కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆఫర్లు పండగ సీజన్‌లో ఖచ్చితంగా ఆకర్షించనున్నాయి. భారీగా షాపింగ్ చేసే వారికి EMI ఆప్షన్లు, క్యాష్‌బ్యాక్, ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు అందించడం వల్ల SBI కార్డ్ ఫెస్టివల్ ఆఫర్స్ 2025 బిగ్ హిట్ అవుతుందని అంచనా.