ఫోన్‌పే వినియోగదారులకు భారీ శుభవార్త..10 నిమిషాల్లో లోన్, కొత్త సేవలు! | Phonepe Loan in 10 mnts
డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే మరో కీలకమైన సేవను ప్రారంభించింది. ఇప్పటికే రీచార్జ్, బిల్ పేమెంట్స్, టికెట్ బుకింగ్, ఇన్స్యూరెన్స్ వంటి పలు సేవలు అందిస్తున్న ఈ యాప్ ఇప్పుడు PhonePe లోన్ సౌకర్యంను అందుబాటులోకి తెచ్చింది.
మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ సౌకర్యం
ఫోన్‌పే యాప్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన Loan Against Mutual Funds (LAMF) ద్వారా వినియోగదారులు తమ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ప్లెడ్జ్ చేసి రుణం పొందవచ్చు. పెట్టుబడులను రీడీమ్ చేయకుండానే 10 నిమిషాల్లో రూ.2 కోట్ల వరకు లోన్ పొందే అవకాశం ఉంది.
ప్రత్యేకతలు ఏమిటి?
ఈ PhonePe లోన్ సౌకర్యంలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే వినియోగదారులు తీసుకున్న మొత్తంపైనే వడ్డీ చెల్లించాలి. ఎటువంటి నెలవారీ ఈఎంఐలు లేకుండా సౌకర్యవంతంగా రుణం పొందవచ్చు. ప్రిన్సిపల్ అమౌంట్‌ను ఎప్పుడైనా తిరిగి చెల్లించవచ్చు, తద్వారా మళ్లీ క్రెడిట్ లైన్ ఉపయోగించుకోవచ్చు.
రుణ ప్రక్రియ ఎలా ఉంటుంది?
- PhonePe యాప్ ఓపెన్ చేసి ‘Loans’ విభాగానికి వెళ్లాలి.
- Loan Against Mutual Fund ఆప్షన్ ఎంచుకోవాలి.
- PAN, OTP ద్వారా అర్హత చెక్ అవుతుంది.
- అర్హత గల మ్యూచువల్ ఫండ్స్ ఆధారంగా లోన్ ఆఫర్ వస్తుంది.
- వినియోగదారులు తమకు కావాల్సిన రుణ మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
- కేవైసీ పూర్తి చేసి, ఆటోపే సెటప్ చేయాలి.
- ఫండ్స్ ప్లెడ్జ్ చేసిన తర్వాత రుణం డిజిటల్ సంతకం ద్వారా వెంటనే డిస్బర్స్ అవుతుంది.
PhonePe అధికారుల స్పందన
ఫోన్‌పే లెండింగ్ సీఈఓ హేమంత్ గాలా మాట్లాడుతూ, ఈ సేవ వినియోగదారుల పెట్టుబడులను అలాగే ఉంచుతూ, తక్షణ లిక్విడిటీ కోసం సురక్షిత క్రెడిట్ యాక్సెస్‌ను అందిస్తుందని చెప్పారు. డీఎస్‌పీ ఫైనాన్స్ సీఈఓ జయేష్ మెహతా మాట్లాడుతూ, ఈ సౌకర్యం వినియోగదారులు తమ పెట్టుబడి వృద్ధితో పాటు తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు.
ఎందుకు వినియోగదారులకు ఇది గేమ్‌చేంజర్?
భారతదేశంలో 64 కోట్లకు పైగా యూజర్లతో ఉన్న PhonePe, ఇప్పటికే డిజిటల్ పేమెంట్స్ రంగంలో అగ్రగామి సంస్థ. ఇప్పుడు PhonePe లోన్ సౌకర్యం ప్రారంభించడం ద్వారా, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పెద్ద ఊరట కలిగే అవకాశం ఉంది.