రాత పరీక్ష లేకుండానే APSRTC లో అప్రెంటిస్ ఉద్యోగాలు: 10వ తరగతి పాస్ అయిన వారికి సువర్ణావకాశం! | APSRTC Jobs 2025 No Written Exam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలకు రాత పరీక్ష లేదు. 10వ తరగతి మరియు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు నేరుగా తమ మార్కుల ఆధారంగా ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ APSRTC అప్రెంటిస్ జాబ్స్ ద్వారా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో మొత్తం 281 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2025 అక్టోబర్ 4. అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో కలిపి 2025 అక్టోబర్ 6లోగా కింది చిరునామాకు పంపించాలి: ప్రిన్సిపాల్, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, కాకుటూర్, వెంకచలం మండలం, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా.
APSRTC నోటిఫికేషన్ ప్రకారం, జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి:
- చిత్తూరు – 48
- తిరుపతి – 88
- నెల్లూరు – 91
- ప్రకాశం – 54
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ అప్లికేషన్ల చివరి తేదీ: 2025 అక్టోబర్ 4
- డాక్యుమెంట్ల సమర్పణ చివరి తేదీ: 2025 అక్టోబర్ 6
దరఖాస్తు ఫీజు: రూ.118
ఎంపిక ప్రక్రియ
- ఆన్‌లైన్‌లో అప్లై చేసి, నింపిన ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో కలిపి కింది చిరునామాకు పంపండి:
ప్రిన్సిపాల్, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, కాకుటూర్, వెంకచలం మండలం, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా. - షార్ట్‌లిస్ట్ చేసిన వారికి కాకుటూరు నెల్లూరు ఆర్‌టీసీ జోన్‌ల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లై లింక్ కోసం APSRTC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
దరఖాస్తు ఫీజు రూ. 118గా నిర్ణయించారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు కాకుటూరులోని ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఈ APSRTC అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ ట్రేడ్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఒక మంచి అవకాశం. మరిన్ని వివరాల కోసం, మీరు APSRTC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Important Links |
---|
![]() |
![]() |
![]() |