ఆటో డ్రైవర్లకు ముందే వచ్చిన దసరా పండుగ – వాహనమిత్ర పథకం ద్వారా ఏటా రూ.15000 సాయం | AP CM Chandrababu Announced 15000 For Auto Drivers | AP Vahanamitra Scheme 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు సీఎం నారా చంద్రబాబు నాయుడు దసరా కానుక ప్రకటించారు. CM Chandrababu వాహనమిత్ర పథకం కింద ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు స్పష్టం చేశారు.
అనంతపురంలో జరిగిన “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభలో ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. దసరా రోజునే ఆటో డ్రైవర్ల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.15,000 జమ చేయనున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది కుటుంబాలకు ఊరట లభించే అవకాశం ఉంది.
అంశం | వివరాలు |
---|---|
పథకం పేరు | వాహనమిత్ర (Vahanamitra) |
లబ్ధిదారులు | రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు |
ఆర్థిక సాయం | ఏటా రూ.15,000 |
ప్రారంభం | దసరా రోజు |
అదనపు సౌకర్యం | రూ.2.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ |
ప్రకటించిన వారు | సీఎం నారా చంద్రబాబు నాయుడు |
సభ | అనంతపురం – సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ |
ముఖ్య ఉద్దేశ్యం | ఆటో డ్రైవర్ల ఆర్థిక స్థిరత్వం, కుటుంబ భద్రత |
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రావడంతో ఆటో డ్రైవర్లు గిరాకీ తగ్గిందని వాపోతున్నారు. వారి సమస్యలను అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు, వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
BIG.. BIG.. BIG Announcement 🔥🔥
— Telugu Desam Party (@JaiTDP) September 10, 2025
ఈ దసరాకి మరో సంక్షేమ పధకం..
🛺 ఆటో డ్రైవర్లని ఆదుకోవటానికి, ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.15 వేల ఆర్ధిక సాయం.#Super6SuperHitEvent#Super6SuperHit#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu pic.twitter.com/sN9GWV2Hix
ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, ఆటో డ్రైవర్ల ఆరోగ్య భద్రత కోసం రూ.2.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ చర్యతో డ్రైవర్లు మరియు వారి కుటుంబాలకు వైద్య పరిరక్షణలో పెద్ద మద్దతు లభించనుంది.
వాస్తవానికి ఆగస్ట్ 15వ తేదీనే ఈ పథకం ప్రారంభం కావాల్సి ఉన్నా, వివిధ కారణాలతో ఆలస్యమైంది. అయితే ఇప్పుడు దసరా రోజున వాహనమిత్ర పథకం అమలవుతుందని ఖరారు చేశారు.
మరోవైపు మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా ఇప్పటి వరకు 5 కోట్ల మంది ప్రయాణించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డీఎస్సీ వంటి హామీలను కూడా అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఆర్థికంగా పెద్ద తోడ్పాటు అందించనుంది.
Important Info |
---|
![]() |
![]() |
![]() |